విటమిన్ బీ1, బీ12 సహా 24 ఫార్మా పదార్థాలు, ఔషధాల ఎగుమతిపై కేంద్రం నిషేధం ఎత్తివేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్ని ఔషధాలపై నిషేధం ఎత్తివేసినప్పటికీ.. పారాసిటమాల్, పారాసిటమాల్ ఫార్ములేషన్లపై నిషేధం కొనసాగుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) స్పష్టం చేసింది.
26 రకాల యాక్టివ్ ఫార్మీసూటికల్ ఇంగ్రీడెంట్స్(ఏపీఐ) ఎగుమతిపై మార్చి 3న నిషేధం విధించింది డీజీఎఫ్టీ. వాటిలో ఇప్పుడు 24 ఔషధాలు, ఫార్ములేషన్లపై బ్యాన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.