తెలంగాణ

telangana

ETV Bharat / business

శానిటైజర్లు, మాస్క్​ల ధరలపై కేంద్రం పరిమితులు - CORONA NEWS

కరోనా నేపథ్యంలో శానిటైజర్లు, మాస్క్​ల ధరల నియంత్రణపై కేంద్రం దృష్టి సారించింది. ఈ వస్తువులను ఇటీవలే నిత్యావసరాల జాబితాలో చేర్చిన కేంద్రం ఇప్పుడు వాటి ధరలపై పరిమితులు విధించింది.

hand sanitizer price cap
శానిటైజర్లపై కేంద్రం నియంత్రణ

By

Published : Mar 21, 2020, 3:54 PM IST

కరోనా నేపథ్యంలో ప్రస్తుతం శానిటైజర్ల వినియోగం పెరిగింది. ఈ పరిస్థితిని అదునుగా చేసుకుని శానిటైజర్ల ధరలు పెరగకుండా కేంద్రం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. 200 మిల్లీలీటర్ల శానిటైజర్​ రిటైల్ ధర రూ.100 మించకూడదని విక్రయదారులకు సూచించింది.

వీటితో పాటు 2 లేయర్ల (సర్జికల్) మాస్క్​ల ధరలు రూ.8, మూడు లేయర్ల (సర్జికల్) మాస్క్​ ధర రూ.10 మించొద్దని వినియోగదారు వ్యవహారాల మంత్రి రాం విలాస్​ పాసవాన్ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్​ 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.

శానిటైజర్లు, మాస్క్​లను నిత్యావసర వస్తువుల జాబితాలో చేరుస్తూ ఈ నెలారంభంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆల్కాహాల్ ఆధారిత శానిటైజర్ల ధరలపై ఆంక్షలు విధించింది.

ఇదీ చూడండి:కరోనాపై పోరుకు 'సబ్బుల' సహాయం

ABOUT THE AUTHOR

...view details