కొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్లు తీవ్ర అస్థిరతకు గురవుతున్నాయి. కరోనా భయాలే మార్కెట్ల ఒడుదొడుకులకు కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం, ఆర్బీఐ.. మార్కెట్లను నిశితంగా పరిశీలిస్తున్నాయని పేర్కొన్నారు.
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు..
నిన్నటి సెషన్లో పేకమేడలా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు నేడు మళ్లీ లాభాల బాటపట్టాయి. సెన్సెక్స్ 1325 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 365 పాయింట్ల వృద్ధితో ట్రేడింగ్ ముగించింది.