తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిరిండియా వాటా కొనుగోలు బిడ్లకు పెరిగిన గడువు

రుణ భారంలో చిక్కుకున్న ఎయిరిండియాలో వాటా కొనుగోలుకు బిడ్లు సమర్పించేందుకు మరో సారి గడవు పొడిగించింది కేంద్రం. ఏప్రిల్​ 30తో ముగియనున్న ప్రస్తుత గడువును జూన్ 30కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

airindia
ఎయిర్​ఇండియా

By

Published : Apr 29, 2020, 7:31 AM IST

ఎయిర్​ఇండియాలో వాటా విక్రయ నిమిత్తం చేపట్టిన బిడ్‌ల దాఖలు ప్రక్రియకు గడువు తేదీని ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. జూన్‌ 30 వరకు బిడ్‌లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. కరోనా వైరస్‌ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. బిడ్‌ల దాఖలుకు గడువు తేదీని ప్రభుత్వం పొడిగించడం ఇది రెండో సారి కావడం గమనార్హం.

ఈ ఏడాది జనవరి 27న ఎయిరిండియాలో వాటా విక్రయ ప్రక్రియను ప్రారంభిస్తూ.. ఆసక్తి ఉన్న కొనుగోలుదార్లు బిడ్‌లు దాఖలు చేసేందుకు మార్చి 18 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఆ తేదీని ఏప్రిల్‌ 30కి పొడిగించింది. ఇప్పుడు జూన్‌ 30 వరకు అవకాశం కల్పిస్తూ పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి:లాక్​డౌన్​లో భారీగా పెరిగిన పీఎఫ్ ఉపసంహరణలు

ABOUT THE AUTHOR

...view details