దేశ రాజధాని దిల్లీలో బంగారం ధర జీవితకాల గరిష్ఠానికి చేరింది. సోమవారం భారీగా కొనుగోళ్లు పెరిగినందున ఒకే రోజు రూ.100 పెరిగింది. ఫలితంగా 10 గ్రాముల పసిడి వెల రూ. 35,970కు చేరిందని 'ఆల్ ఇండియా సరాఫా అసోషియేషన్(ఏఐఎస్ఏ)' తెలిపింది.
దిల్లీలో 24, 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100 మేర పెరిగాయి. ఫలితంగా 10 గ్రాముల వెల వరుసగా రూ. 35,970, రూ. 35,800 కు చేరాయి. ఇదే బాటలో 8 గ్రాముల బంగారు నాణెం ధర రూ. 27,500కు వెళ్లింది.
"ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ.35,970 కు చేరింది. పసిడి జీవితకాలంలో ఇదే అత్యధికం"
- సురేంద్ర జైన్, ఏఐఎస్ఐ ఉపాధ్యక్షుడు