బంగారం ధరలు(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.190 మేర పెరిగింది. కిలో వెండి ధర రూ.355 ఎగబాకింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర రూ.48,750గా ఉంది.
- వెండి ధర సైతం ఈ నగరాల్లో పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.65,625 పలుకుతోంది.
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,786 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
- ఔన్సు స్పాట్ వెండి ధర 23.85 డాలర్లుగా ఉంది.