బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.63 పెరిగి రూ.40,723గా ఉంది. కిలో వెండి ధర మాత్రం రూ.95 తగ్గి రూ.47,082గా ఉంది.
"పసిడికి అంతర్జాతీయ డిమాండ్ పెరిగి, రూపాయి బలహీనపడిన నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.."- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్
అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,556 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 17.67 డాలర్లుగా ఉంది.
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుండడం, అమెరికా-చైనా రెండో దఫా వాణిజ్య ఒప్పందం విషయంలో పెట్టుబడిదారులు మరింత అప్రమత్తంగా ఉన్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగిందని తపన్ విశ్లేషించారు.
ఇదీ చూడండి:లాభపడిన స్టాక్మార్కెట్లు.. రాణించిన ఎల్&టీ, ఎస్ బ్యాంకు