తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..

Gold Rate today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 37 పెరిగింది.

gold price
బంగారం ధర

By

Published : Mar 21, 2022, 12:25 PM IST

Gold Price Today: బంగారం ధర స్వల్పంగా పెరిగింది. క్రితం రోజుతో పోల్చితే 10 గ్రాముల పసిడి వెల రూ. 37 మేర పెరిగింది. వెండి ధర కూడా అదే బాటలో పయనించి కిలోకు రూ.125 వృద్ధి చెందింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Gold price in Hyderabad: హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర రూ.52,940గా ఉంది. కిలో వెండి ధర రూ.69,438 వద్ద కొనసాగుతోంది.

Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 52,940 గా, కేజీ వెండి ధర రూ.69,438 గా ఉంది.

Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర రూ.52,940 కాగా.. కిలో వెండి ధర రూ.69,438.

Gold price in Proddatur: ప్రొద్దుటూర్​లో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 52,940 గా, కేజీ వెండి ధర రూ.69,438 గా ఉంది.

స్పాట్​ గోల్డ్ ధర ఎంతంటే..

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్​ గోల్డ్ ధర ధర 1,925.05 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.02 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి:

క్లోవియాలో 89శాతం వాటాను కొనుగోలు చేసిన రిలయన్స్‌ రిటైల్‌

ABOUT THE AUTHOR

...view details