బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి చేదు కబురు. పసిడి మరింత ప్రియం అయింది. సోమవారం దిల్లీలో 460 రూపాయలు పెరిగిన 10 గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి ధర రూ. 38వేల 860కి చేరింది.
రూపాయి విలువ క్షీణించడం, చమురు ధరలు మరింత పెరగడమే ఇందుకు కారణం.
వెండి ధరకూ రెక్కలొచ్చాయి. సోమవారం ఏకంగా 1,096 రూపాయలు పెరిగిన కిలో వెండి.. 47వేల 957కు చేరుకుంది.
అంతర్జాతీయంగానూ పసిడి ధర పెరిగింది. న్యూయార్క్లో ఒక్క ఔన్స్ 1,504 డాలర్లకు చేరింది. ఒక్క ఔన్స్ వెండి ధర 17.87 డాలర్లను తాకింది.
ముడి చమురు ఇలా...
సౌదీ అరేబియా ప్లాంట్లపై శనివారం డ్రోన్ దాడి జరడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది. చమురు ధరలు సోమవారం రికార్డు స్థాయిలో పెరిగాయి. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ 19.5 శాతం పెరిగి 71.95 డాలర్లకు చేరుకుంది.
ఇదీ చూడండి:-టోకు ద్రవ్యోల్బణం స్థిరం... వడ్డీ రేట్ల కోత ఖాయం!