తెలంగాణ

telangana

ETV Bharat / business

దిగొచ్చిన పసిడి.. రూ.41 వేల దిగువకు 10 గ్రాముల ధర

పసిడి, వెండి ధరలు మరింత తగ్గాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.396 క్షీణించింది. వెండి ధర కిలోకు నేడు రూ.179 తగ్గింది.

gold
బంగారం

By

Published : Feb 5, 2020, 5:12 PM IST

Updated : Feb 29, 2020, 7:05 AM IST

బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు రూ.396 తగ్గి.. రూ.40,871కి చేరింది.

అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్​ లేమితో, ధరల్లో తగ్గుదల నమోదవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోనూ బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

బంగారంతో పాటే వెండి ధర నేడు స్వల్పంగా క్షీణించింది. కిలో వెండి ధర నేడు రూ.179 (దిల్లీలో) తగ్గి.. రూ.46,881 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం, వెండి ధరలు ఫ్లాట్​గా ఉన్నాయి. ఔన్సు బంగారం ధర 1,554 డాలర్లుగా, వెండి ఔన్సుకు 17.70 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:నైట్​ షిఫ్టులతో ఐటీ ఉద్యోగులు సతమతం!

Last Updated : Feb 29, 2020, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details