తెలంగాణ

telangana

ETV Bharat / business

రూపాయి బలపడింది- బంగారం దిగొచ్చింది.. ఎంతంటే... - బలహీన అంతర్జాతీయ సూచనలు

అంతర్జాతీయ ప్రతికూలతలకు తోడు రూపాయి బలపడిన నేపథ్యంలో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.121 తగ్గి... రూ.38,564కు చేరుకుంది. అలాగే కిలో వెండి ధర రూ.851 రూపాయలు తగ్గి రూ.46,384లకు దిగొచ్చింది.

రూపాయి బలపడింది- బంగారం దిగొచ్చింది.. ఎంతంటే...

By

Published : Sep 27, 2019, 4:50 PM IST

Updated : Oct 2, 2019, 5:39 AM IST

బంగారం ధరలు మరోసారి స్వల్పంగా దిగొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.121 తగ్గి రూ.38,564కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.851 తగ్గి రూ.46,384కు దిగొచ్చింది.

"బలహీన అంతర్జాతీయ సూచనలు, రూపాయి బలపడడం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయి."
- దేవర్ష్​ వకీల్​, అడ్వైజరీ, హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్​ బంగారం ధర 1,497.17 డాలర్లకు, ఔన్స్​ వెండి ధర 17.54 డాలర్లకు తగ్గాయి.

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 1 శాతం మేర పడిపోయిన తరువాత, మధ్యాహ్నం సెషన్​లో డాలర్​తో పోల్చినపుడు రూపాయి విలువ బలపడింది. ఫలితమే బంగారం ధరల తగ్గుదల.

ఇదీ చూడండి: ట్రంప్​కు కష్టం - దేశీయ స్టాక్​మార్కెట్లకు నష్టం

Last Updated : Oct 2, 2019, 5:39 AM IST

ABOUT THE AUTHOR

...view details