దేశంలో పసిడి ధరలు(gold price today) మరోసారి తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర సోమవారం స్వల్పంగా రూ.152 తగ్గి.. రూ.48,107కి చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణతతో బంగారం ధరలు దిగివస్తున్నట్లు నిపుణులు తెలిపారు.
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు - దిల్లీలో వెండి ధర
పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.152 తగ్గింది. వెండి కిలో ధర రూ.70వేల మార్కును కోల్పోయింది.
బంగారం, వెండి ధరలు
వెండి ధర(silver price today) రూ.540 (కిలోకు) తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.69,925 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1883 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 27.55 డాలర్ల వద్ద ఉంది.