టాటా గ్రూప్, సింగపూర్‌కు చెందిన జీఐసీ, ఎస్ఎస్జీ మేనేజ్మెంట్ సంయుక్తంగా సుమారు రూ.8 వేల కోట్లతో జీఎంఆర్ విమానాశ్రయాల్లో వాటాల కొనుగోలుకు సన్నద్ధమవుతున్నాయి. ఒప్పందంలో భాగంగా జీఎంఆర్ ఎయిర్‌పోర్టులో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి మూడు సంస్థలు. మిగిలిన రూ.7 వేల కోట్లను జీఎంఆర్ వద్ద నుంచి వాటాల కొనుగోలుకు వినియోగించనున్నాయి. దేశంలో అతిపెద్దదైన దిల్లీ సహా అనేక విమానాశ్రయాలను జీఎంఆర్ నిర్వహిస్తోంది.
జీఎంఆర్ వాటాల కొనుగోలుకు టాటా సిద్ధం - షేర్లు
సింగపూర్‌కు చెందిన సంస్థలతో కలిసి జీఎంఆర్‌లో వాటాల కొనుగోలుకు సిద్ధమైంది టాటా కంపెనీ. ఒప్పందం విలువ దాదాపు రూ.8 వేల కోట్లు.
జీఎంఆర్
ఒప్పందం అనంతరం టాటా సంస్థకు 20 శాతం, జీఐసీకి 15, ఎస్ఎస్జీకు 10 శాతం వాటాలు దక్కనున్నాయి. జీఎంఆర్‌తో ఒప్పందం ద్వారా టాటా సంస్థ మొదటి సారి విమానాశ్రాయాల అభివృద్ధి రంగంలోకి అడుగు పెట్టనుంది.