తెలంగాణ

telangana

ETV Bharat / business

2025 నాటికి 'సౌర విద్యుత్తు రారాజు'గా అదానీ గ్రూప్​! - 2025 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద సౌరవిద్యుత్ సంస్థగా అదానీ!

సౌరవిద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా అదానీ గ్రూప్​ను నిలపాలని ఆ సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ నిర్ణయించారు. 2025 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్​ సంస్థగా, 2030 నాటికి అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సంస్థగా అదానీ గ్రూప్​ నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

adani as world's largest renewable energy player
2025 నాటికి 'సౌర రారాజు'గా అదానీ గ్రూప్​!

By

Published : Jan 22, 2020, 8:29 PM IST

Updated : Feb 18, 2020, 1:02 AM IST

అదానీ గ్రూప్​ను 2025 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్​ సంస్థగా, 2030 నాటికి అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సంస్థగా నిలపాలని ఆ సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఓ ప్రణాళికను కూడా రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు.

15 బిలియన్ డాలర్ల విలువైన అదానీ గ్రూప్​... ఇంధనం, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, స్థిరాస్తి, రక్షణ లాంటి వివిధ రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తుంటుంది.

"ప్రస్తుతం మాకున్న 2.5 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్​ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2020లో రెట్టింపు చేయాలని భావిస్తున్నాం. 2025 నాటికి 18 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలని నిర్ణయించాం."
- గౌతమ్​ అదానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్​ లింక్​డ్​ఇన్​ పోస్టు

కాలుష్యాన్ని తగ్గించేందుకే..

అదానీ గ్రూప్​ బొగ్గు ఆధారిత విద్యుత్​ ప్లాంట్లను మాత్రమే కాకుండా... భారత్​, అస్ట్రేలియాల్లో బొగ్గు గనులను కూడా కలిగి ఉంది. ఇందు కోసమే కార్గో షిప్స్​, ఓడరేవులు, విద్యుత్​ ప్లాంట్లపై కూడా భారీగా (సమయాన్ని కూడా) పెట్టుబడులు పెట్టింది.

బొగ్గు ఆధారిత ఇంధన ఉత్పత్తి వల్ల భారీగా వాయుకాలుష్యం జరుగుతుంది. దీనిని అరికట్టేందుకే తాము ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని గౌతమ్ అదానీ తెలిపారు. కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తిలో అగ్రపథాన నిలవడానికి ప్రయత్నిస్తామని అన్నారు. ఇందు కోసం తమ గ్రూప్​ బడ్జెట్​లో 70 శాతం వరకు కేటాయిస్తామని గౌతమ్​ అదానీ స్పష్టం చేశారు.

దినదిన ప్రవర్థమానం

"2019లో ప్రపంచంలోని 6వ అతిపెద్ద సౌరవిద్యుత్​ ఉత్పత్తిదారుగా అదానీ నిలిచింది. ఈ ప్రయాణంలో భాగంగా 2020 నాటికి భారతదేశపు అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సంస్థగా, 2021 నాటికి మొదటి మూడు ప్రపంచ సౌర శక్తి సంస్థల్లో ఒకటిగా నిలుస్తాం."
- గౌతమ్​ అదానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్​

గుజరాత్​లో సౌరవిద్యుత్​ కేంద్రం

తమ లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో భాగంగా, గుజరాత్​లోని ముంద్రాలో 1.3 గిగావాట్ల సామర్థ్యంగల అత్యాధునిక సౌర ఘటం, మాడ్యూల్ తయారీ కర్మాగారం విస్తరిస్తామని గౌతమ్ తెలిపారు. ఫలితంగా ఇది 3.5 గిగావాట్ల సామర్థ్యంగల ఉత్పాదక కేంద్రంగా మారుతుందన్నారు. ప్రపంచంలో 100 శాతం గ్రీన్ ఎనర్జీ ఆధారిత రసాయన తయారీ, సమాచార కేంద్రాల​ సదుపాయాలను కల్పించడానికి వెంచర్లు నెలకొల్పడానికి చర్చలు జరుపుతున్నట్లు గౌతమ్ అదానీ పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు

ప్రత్యామ్నాయ ఇంధన వనరులవైపు ప్రపంచ దేశాలు పయనిస్తున్నాయి. బొగ్గు వినియోగం ఇప్పటికే ఐరోపా దేశాల్లో బాగా తగ్గింది. కానీ ఆసియా దేశాల్లో ఇప్పటికీ బొగ్గు వినియోగం అధికంగా జరుగుతుండడం గమనార్హం.

ఇదీ చూడండి:టాటా నుంచి కొత్త మోడల్​- రూ.5.3 లక్షలకు 'ఆల్ట్రోజ్'

Last Updated : Feb 18, 2020, 1:02 AM IST

ABOUT THE AUTHOR

...view details