తెలంగాణ

telangana

ETV Bharat / business

టీఆర్​పీ స్కాం కేసులో బార్క్​ మాజీ సీఈఓ అరెస్ట్​ - కుంభకోణం

టీఆర్​పీ అవకతవకల కేసుకు సంబంధించి బార్క్​ మాజీ సీఈఓను అరెస్టు చేశారు ముంబయి క్రైం బ్రాంచ్​ పోలీసులు. ఈ కేసులో అరెస్టైన పదిహేనో వ్యక్తి పార్థో దాస్​గుప్తా.

Former CEO of rating agency BARC arrested in TRP scam
టీఆర్​పీ స్కాం కేసులో బార్క్​ మాజీ సీఈఓ అరెస్ట్​

By

Published : Dec 25, 2020, 5:45 AM IST

కొద్ది రోజుల క్రితం వెలుగుచూసిన టెలివిజన్​ రేటింగ్​ పాయింట్స్​ (టీఆర్​పీ) కుంభకోణంలో బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్​ రీసెర్చ్​ కౌన్సిల్​(బార్క్​) మాజీ సీఈఓను అరెస్టు చేశారు ముంబయి క్రైం బ్రాంచ్​ పోలీసులు. పార్థో దాస్​గుప్తాను పుణెలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆయనను శుక్రవారం.. కోర్టు ముందు హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. ఈ కేసును విచారిస్తున్న క్రైం ఇంటెలిజెన్స్​ యూనిట్​.. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 15 మందిని అరెస్టు చేసింది. ఇందులో బార్క్​ చీఫ్​ ఆపరేటింగ్​ ఆఫీసర్​(సీఓఓ) రమిల్​ రామ్​గర్హియా సహా రిపబ్లిక్​ టీవీ సీఈఓ వికాస్​ ఖంచందాని ఉన్నారు.

టీఆర్​పీల కోసం కొన్ని ఛానళ్లు మోసాలకు పాల్పడుతున్నాయంటూ బార్క్.. పలు మీడియా సంస్థలపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టీఆర్​పీలు పెంచుకోవటానికి కొన్ని కుటుంబాలకు డబ్బులు ఇచ్చి మరీ.. తమ ఛానళ్లను చూసేలా మీడియా సంస్థలు చేస్తున్నాయంటూ బార్క్ ఆరోపిస్తోంది.

ఇదీ చూడండి:టీఆర్​పీ స్కామ్​ బట్టబయలు- 3 ఛానళ్లపై కేసులు

ABOUT THE AUTHOR

...view details