భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసే వస్తువు బంగారం. పురాతన కాలం నుంచి భారతదేశంలో బంగారాన్ని విలువైన వస్తువుగా పరిగణిస్తున్నారు. పట్టణ ప్రాంతాల వాళ్ళైనా లేదా గ్రామీణ ప్రాంతం వాళ్ళైనా, ధనిక లేదా పేద వాళ్ళైనా ప్రతి ఒక్కరూ బంగారం కొనడానికి ప్రయత్నిస్తారు. బంగారాన్ని కొనుగోలు చేయడానికి మహిళలు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తారు. అలాగే వారు ఎక్కువగా నగల రూపంలో బంగారం కొనడానికి ఇష్టపడతారు.
భారతదేశంలో వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వం బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ ను తప్పనిసరి చేసింది. బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ నాణ్యతపై నియంత్రణను కలిగి ఉండటమే కాకుండా మోసం చేయడానికి ప్రయత్నించే షాపు యజమానులు నుంచి వినియోగదారులను కాపాడుతుంది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చట్టం ప్రకారం, భారతీయ ప్రమాణాల ఆధారంగా బంగారాన్ని హాల్‌మార్కింగ్ ఏజెన్సీ ధృవీకరిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, బంగారు ఆభరణాలను అధికారిక హాల్‌మార్కింగ్ కేంద్రాల్లో మూల్యాంకనం చేసి పరీక్షిస్తారు, అనంతరం బంగారం జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్వచ్ఛత కలిగి ఉందని ధృవీకరిస్తుంది.
బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే ముందు హాల్‌మార్క్‌ను తప్పక తనిఖీ చేయాలి. హాల్‌మార్క్ ఐదు భాగాలను కలిగి ఉంటుంది
(1) బీఐఎస్ ప్రామాణిక గుర్తు :
బీఐఎస్ హాల్ మార్క్ చూడడానికి ఇలా ఉంటుంది
(2) స్వచ్ఛమైన బంగారం :
999 – 24 క్యారట్ - స్వచ్ఛమైన బంగారం
958 – 23 క్యారట్
916 – 22 క్యారట్
875 – 21 క్యారట్
750 – 18 క్యారట్
708 – 17 క్యారట్
585 – 14 క్యారట్
417 – 10 క్యారట్
375 – 9 క్యారట్
333 – 8 క్యారట్