తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆగస్టు చివరికి రూ.5.54 లక్షల కోట్లకు ద్రవ్యలోటు - ఆర్థిక సంవత్సర ప్రథమార్థ గణాంకాలను

దేశ ద్రవ్యలోటు ఆగస్టు చివరి నాటికి రూ.5.54 లక్షల కోట్లుగా నమోదైంది. తాజా ఆర్థిక సంవత్సర ప్రథమార్థ గణాంకాలను కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ అకౌంట్స్​ (సీజీఏ) విడుదల చేసింది.

ఆగస్టు చివరికి రూ.5.54 లక్షల కోట్లకు ద్రవ్యలోటు

By

Published : Oct 1, 2019, 6:07 AM IST

Updated : Oct 2, 2019, 5:01 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు రూ. 5.54 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది 2019-20 బడ్జెట్​ అంచనాల్లో 78.7 శాతానికి సమానం.

ప్రభుత్వ ఆదాయం, వ్యయానికి మధ్య అంతరాన్నే ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ అకౌంట్స్​ (సీజీఏ) విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆగస్టు చివరి నాటికి ద్రవ్యలోటు రూ.5,53,840 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం 2018-19.. ఇదే కాలానికి బడ్జెట్​ అంచనాల్లో 86.5 శాతంగా ద్రవ్యలోటు ఉంది.

ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి లోటు రూ.7.03 లక్షల కోట్లుగా (జీడీపీలో 3.3 శాతం) ఉండొచ్చని బడ్జెట్​లో అంచనా వేసింది ప్రభుత్వం.

ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు ఇటీవల కార్పొరేట్​ పన్నులో కోత విధించింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయానికి గండి పడనుంది. ఈ ఆర్థిక సవంత్సరం ద్వితీయార్థంలో రూ.2.86 లక్షల కోట్ల రుణాలు తీసుకునే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి చక్రవర్తి తెలిపారు.

ఆగస్టు చివరి నాటికి ఆదాయంలో గతేడాదితో పోల్చితే సుమారు 30.7 శాతం వృద్ధి నమోదైనట్లు సీజీఏ తెలిపింది. కేంద్రానికి రూ.6.03 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొంది. ఇక ఇదే కాలానికి వ్యయం రూ.11.75 లక్షల కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ఆదాయాన్ని రూ. 19.62 లక్షల కోట్లుగా, వ్యయాన్ని రూ.27.86 లక్షల కోట్లుగా అంచనా వేసింది ప్రభుత్వం.

ఇదీ చూడండి:స్థిరాస్తి: 7 ప్రధాన నగరాల్లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు

Last Updated : Oct 2, 2019, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details