అమెజాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస చర్యలకు ఉపక్రమించింది ఐరోపా సమాఖ్య(ఈయూ). ఈ-కామర్స్ దిగ్గజం తన వినియోగదారుల సమాచారాన్ని అక్రమ మార్గంలో లబ్ధి పొందేందుకు వినియోగిస్తోందని పేర్కొంది. ఈ మేరకు స్పందించాలని అమెజాన్ సంస్థను ఆదేశించినట్లు ఈయూ ఎగ్జిక్యూటివ్ కమిషన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
అమెజాన్‌పై ఐరోపా సమాఖ్య అవిశ్వాస చర్యలు! - ఈయూ
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై అవిశ్వాస చర్యలు చేపట్టింది ఐరోపా సమాఖ్య (ఈయూ). వినియోగదారుల సమాచారాన్ని అక్రమ మార్గంలో లబ్ధి పొందేందుకు వినియోగిస్తోందని పేర్కొంది. దీనిపై స్పందించాలని సంస్థను ఆదేశించింది.
అమెజాన్‌పై ఐరోపా సమాఖ్య అవిశ్వాస చర్యలు
మార్కెట్ పోటీతత్వంలో ఉన్న నష్టాలను నివారించేందుకు వినియోగదారుల డేటాను క్రమపద్ధతిలో వినియోగించటం, ఫ్రాన్స్, జర్మనీలో తమ వ్యాపారాన్ని పెంచుకునే అంశంపై సమస్యలను అమెజాన్ ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపింది ఈయూ కమిషన్.
ఇదీ చూడండి:అమెజాన్‌పై కేంద్రం చర్యలు-పేటీఎం, గూగుల్‌కు సమన్లు!