తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎన్​ఫీల్డ్​కు పోటీగా హార్లే డేవిడ్​సన్​ 'బడ్జెట్' బైక్​!

బైక్​ లవర్స్​కు హార్లే డేవిడ్​సన్​ బైక్​లు కొనడం ఓ కల. కానీ... భారీ ధర కారణంగా వాటిని సొంతం చేసుకోవడం అందరికీ కుదరదు. అయితే... అందరికీ అందుబాటులో ధరలో, మిడ్​ రేంజ్​ సగ్మెంట్​లో ఆ సంస్థ ఓ బైక్​ను తీసుకురానున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఓ బైక్​కు సంబంధించిన ఫొటో, ఫీచర్లు ఇంటర్నెట్​లో చక్కర్లు కొడుతున్నాయి. మరి అవేమిటో మీరు చూసేయండి.

Harley Davidson Entry level bike features
హార్లే డేవిడ్​సన్​ నుంచి బడ్జెట్ ధరలో బైక్

By

Published : Mar 19, 2021, 1:46 PM IST

అమెరికాకు చెందిన దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హార్లే డేవిడ్​సన్ సరికొత్త ఎంట్రీ లెవల్​ బైక్​ ఫొటోస్​ ఇంటర్నెట్​లో లీకయ్యాయి. త్వరలోనే ఈ కొత్త బైక్​ను భారత్​లో ఆవిష్కరించాలని హార్లే డేవిడ్​సన్​ కసరత్తు చేస్తుండటం గమనార్హం. ఈ ఎంట్రీ లెవల్​ బైక్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​కు గట్టి పోటీ ఇస్తుందనే అంచనాలున్నాయి.

2019లో హార్లే డేవిడ్​సన్​.. చైనాకు చెందిన వాహన తయారీ సంస్థ కియాన్​జియాంగ్​తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి హార్లే ఎంట్రీ లెవెల్ బైక్​పై ఊహాగానాలు పెరిగిపోయాయి. ఇటాలియన్​ బైక్​ బ్రాండ్​ బెనెల్లీ మాతృసంస్థే ఈ కియనాన్​జియాంగ్.

ఆటోమొబైల్​ విశ్లేషకుల ప్రకారం.. హార్లే కొత్త బైక్​ బెనెల్లీ 302ఎస్​ను పోలి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ కొత్త బైక్​ ప్రధానంగా ఆసియా మార్కెట్​ను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. లీకైన ఫొటోలు చూస్తే.. కొత్త బైక్ బ్లాక్​ కలర్​లో రానున్నట్లు అర్థమవుతోంది.

అయితే ఇంత వరకు హార్లే డేవిడ్సన్​ గానీ, కియాన్​జియాంగ్​ కానీ తమ సంయుక్త ప్రాజెక్ట్​పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

హార్లే కొత్త బైక్​పై అంచనాలు

  • 296సీసీ వి-ట్విన్,​ 30 హార్స్​పవర్​ ఇంజిన్​
  • బైక్​ బరువు దాదాపు 160 కిలోలు
  • 1400 ఎంఎం వీల్​బేస్​
  • వెనకవైపు 16 అంగుళాలు, ముందువైపు 15 అంగుళాల అలాయ్​​ వీల్స్
  • టాప్​ స్పీడ్​ గంటకు 130 కిలోమీటర్లు
  • యాంటీలాక్​ బ్రేకింగ్ సిస్టమ్​

ఈ కొత్త బైక్​ను భారత్​కు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత్​లో హార్లే తమ తయారీ ప్లాంట్​ను గత ఏడాది పూర్తిగా మూసేసింది. విక్రయాలకోసం హీరో మోటోకార్ప్​తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చదవండి:ఐపీఓల్లో మదుపు.. ఇవన్నీ చూశాకే..

ABOUT THE AUTHOR

...view details