తెలంగాణ

telangana

ETV Bharat / business

పీఎం కేర్స్​కు విరాళాల వెల్లువ-కరోనా కట్టడికి తలో చేయి

కరోనాపై పోరాటానికి కార్పొరేట్ల నుంచి సాధారణ ఉద్యోగుల వరకు అందరు ముందుకొస్తున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పోర్ట్​లలోని ఉద్యోగులు రూ. 7 కోట్లు విరాళంగా ఇచ్చారు. ప్రభుత్వ రంగ నౌకాశ్రయ సంస్థలు రూ.52 కోట్లను పీఎం-కేర్స్‌కు విరాళం ఇచ్చాయి.

donations to pm cares
పీఎం కేర్స్​కు విరాళాల వెల్లువ

By

Published : Apr 7, 2020, 6:24 AM IST

భారత్‌లోని 12 ప్రధాన నౌకాశ్రయాలు, షిప్పింగ్‌ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థలు రూ.52 కోట్లను పీఎం-కేర్స్‌కు విరాళం ఇచ్చాయి. ఆ మేరకు కరోనా వైరస్‌ పోరుకు, బాధితుల చికిత్సకు ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరో పక్క ఈ ప్రధాన నౌకాశ్రయాలు, షిప్పింగ్‌ పీఎస్‌యూలకు చెందిన 30,000 మంది ఉద్యోగులు.. తమ ఒక రోజు వేతనాన్ని(మొత్తం రూ.7 కోట్లు) పీఎం-కేర్స్‌కు అందించారు. కొవిడ్‌-19పై పోరులో తమ వంతు సహాయంగా వీటిని అందజేశారు.

సోనీ పిక్చర్స్​ 10 కోట్లు..

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన సినీ, మీడియా రోజువారీ కూలీలకు సాయంగా రూ.10 కోట్ల విరాళం ప్రకటించింది సోనీ పిక్చర్స్​.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంపిక..

కరోనాపై భారత్​ పోరాటానికి పీఎం కేర్స్​కు నిధులు సేకరించేందుకు బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్రను కేంద్రం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారికంగా వెల్లడించింది.

గత వారం ఇండియన్​ ఓవర్సిస్​ బ్యాంక్.. పీఎం కేర్స్​కు నిధులు సేకరించేందుకు ఎంపికైంది.

ఐసీఐసీఐకి అనుమతి..

పీఎం కేర్స్​కు నిధులు సేకరించేందుకు అనుమతులు లభించినట్లు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్​ వెల్లడించింది. తమ వినియోగదారులు ఎవరైనా పీఎం కేర్స్​కు విరాళం ఇవ్వాలనుకుంటే మొబైల్​ యాప్​, నెట్​ బ్యాంకింగ్, ఆర్​టీజీఎస్​, నెఫ్ట్ అన్నింటి ద్వారా ఇవ్వొచ్చని తెలిపింది.

ఇదీ చూడండి:'2020లో భారీగా పెరగనున్న నిరర్థక ఆస్తులు'

ABOUT THE AUTHOR

...view details