తెలంగాణ

telangana

ETV Bharat / business

'భారత్‌లో వచ్చే ఏడాది వేతనాలు గణనీయ పెంపు' - ఎయాన్‌ పీఎల్‌సీ, మైకేల్‌ పేజ్‌ నివేదిక

వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్‌లో ఉద్యోగుల వేతనాలు సగటున 8 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. ఇ-కామర్స్‌, ఫార్మా, ఐటీ, ఆర్థిక సేవల రంగంలో వేతనాలు మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

భారత్​లో ఉద్యోగుల జీతాలు
salaries of indian employees

By

Published : Jul 24, 2021, 11:01 AM IST

కరోనా లాక్‌డౌన్‌ నుంచి వ్యాపార సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరం కోలుకోనున్నాయని ఓ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే వృత్తి నిపుణుల కొరత కూడా వేతనాల పెంపునకు దోహదం చేయనుందని పేర్కొంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్‌లో ఉద్యోగుల వేతనాలు సగటున 8 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థలైన ఎయాన్‌ పీఎల్‌సీ, మైకేల్‌ పేజ్‌ రూపొందించిన నివేదిక పేర్కొంది. ప్రస్తుత సంవత్సరంలో 6-8 శాతం మేర వేతనాలు పెరిగనున్నాయని పలు సర్వేలు గతంలో అంచనా వేశాయి. గత కొన్నేళ్లుగా ఆసియా దేశాల్లో భారత్‌లోనే అధిక వేతన పెంపు ఉంటోందని ఈ తాజా నివేదిక గుర్తు చేసింది. రానున్న రెండేళ్లు కూడా అదే పోకడ కొనసాగనుందని స్పష్టం చేసింది.

ఇ-కామర్స్‌, ఫార్మా, ఐటీ, ఆర్థిక సేవల రంగంలో వేతనాలు మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. రిటైల్‌, ఏరోస్పేస్‌, హోటల్‌, హాస్పిటాలిటీ రంగాలు మాత్రం వేతన పెంపులో వెనుబడనున్నాయని తెలిపింది.

ఇదీ చూడండి:Gold Rate Today: మళ్లీ తగ్గిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

ఇదీ చూడండి:ఏపీ, తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు

ABOUT THE AUTHOR

...view details