తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎలక్ట్రానిక్​ కార్ల పరుగులు - ఓలా కియా

హుందాయి​-కియా-ఓలా ఒప్పందం చూస్తే త్వరలోనే భారత రోడ్లపై ఎలక్ట్రానిక్​ కార్లు పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్​ కార్ల అభివృద్ధి కోసం హుందాయి-కియా, ఓలాలో 300 మిలియన్​ డాలర్ల భారీ పెట్టుబడిని పెట్టనున్నాయి.

హుందాయి​-కియా-ఓలా

By

Published : Mar 19, 2019, 9:01 PM IST

Updated : Mar 19, 2019, 9:09 PM IST

కొరియా ఆటో మొబైల్​ దిగ్గజం హుందాయి దాని అనుబంధ సంస్థ కియా మోటర్స్​ ఎలక్ట్రానిక్​ వాహనాల అభివృద్ధి కోసం ఓలా సంస్థలో 3 వందల మిలియన్​ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.

భారత్​లో ఎలక్ట్రానిక్​ వాహనాల అభివృద్ధితో పాటు, ఛార్జింగ్​ స్టేషన్ల ఏర్పాటుకు ఈ నిధులు వినియోగించనున్నట్లు ఈ మూడు సంస్థలు ప్రకటించాయి.

ఈ ఒప్పందం ద్వారా వాహనాల తయారీతో పాటు వాటి నిర్వహణ, వినియోగం సులభతరం అవుతాయని హుందాయి​ పేర్కొంది.

ఒకసారి ఎలక్ట్రానిక్​ కార్ల తయారీ పూర్తయితే వీటిని ఈ మూడు సంస్థల భాగస్వామ్యంతో ఓలా డ్రైవర్లకు వాయిదాల పద్ధతిలో అందించనున్నాయి.

ప్రయాణికుల అవసరాల మేరకు కార్లలో మార్పులు చేయడానికి ఈ మూడు సంస్థలు మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Last Updated : Mar 19, 2019, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details