కొవాగ్జిన్ టీకా అత్యవసర ఉపయోగానికి సంబంధించి అనుమతుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్ధకు అవసరమైన పత్రాలను సమర్పించినట్లు ఈ వ్యాక్సిన్ తయారీ సంస్ధ భారత్ బయోటెక్ తెలిపింది. వీలైనంత త్వరగా అనుమతులు రాగలవని ఆశిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా ట్విట్టర్‌లో వెల్లడించారు.
భారత్ బయోటెక్ విజ్ఞప్తిపై నాలుగు నుంచి ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ కూడా తెలిపారు. ఈ అంశంపై తమ నిపుణుల కమిటీ సమీక్ష జరుపుతోందని వివరించారు.