మొన్నటి వరకు కృత్రిమ మేథతో ఉద్యోగాలు కోల్పోతామని వివిధ సర్వేలు వెల్లడించాయి. ఇప్పుడు ఆ జాబితాలో డిజిటల్ సాంకేతికత చేరింది. 2025 నాటికి నాలుగున్నర కోట్ల ఉద్యోగాలపై డిజిటల్ సాంకేతికత ప్రభావం చూపే అవకాశముందని ఓ నివేదిక హెచ్చరించింది.
4 కోట్లకుపైగా ఉద్యోగాలు హాంఫట్..! - 2025
కృత్రిమ మేథ మాత్రమే కాదు డిజిటల్ సాంకేతికత సైతం ఉద్యోగాలపై ప్రభావం చూపనుందని ఓ సర్వే పేర్కొంది. రానున్న కాలంలో డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తోన్న కంపెనీల జీడీపీ రెట్టింపు కానుందని సర్వే వెల్లడించింది.
డిజిటల్ సాంకేతికత
ఇదే సమయంలో ఆరున్నర కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరగనుందని ఆ నివేదికే పేర్కొంది. మెకిన్స్ గ్లోబల్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. ప్రస్తుతం డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకున్న ఐటీ, వ్యాపార సంస్థలు, డిజిటల్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ రంగాలు 2025 నాటికి తమ జీడీపీని రెట్టింపు చేసుకుంటాయని నివేదిక పేర్కొంది.
డిజిటల్ సాంకేతికతను అభివృద్ధి పరచడానికి ప్రభుత్వాలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది.