లాక్డౌన్ ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. ఈ సమయంలో జరిగే శుభకార్యాలకు హాజరుకావడం కష్టమైన పనే. అయితే స్వీయ నిర్బంధంలో ఉన్నా సరే పుట్టిన రోజులు, వార్షికోత్సవాలు, ఇతరత్రా ప్రత్యేక రోజులను మరింత ప్రత్యేకంగా జరుపుకునేందుకు డిజిటల్ వేదిక సిద్ధమైంది.
ఇంట్లోనే ఉండి ఇష్టమైన వారిని ఆశ్చర్య పరిచేందుకు డిజిటల్ కానుకలు అందుబాటులోకి వచ్చాయి. వీడియో కాల్లో గిటారిస్ట్తో సరికొత్తగా గిటారు వాయించడం, ప్రత్యేకంగా అవతలి వ్యక్తికి చెప్పాలనుకున్న భావాలను వీడియో సందేశం ద్వారా అందించడం, ఈ- స్టోరీ పుస్తకాలు, ఇతర డిజిటల్, వర్చువల్ కానుకలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది 'ఫెర్న్స్ ఎన్ పెటల్స్' అనే ఆన్లైన్ పూల విక్రయ సంస్థ.
ప్రత్యేక సంగీతం వారి కోసమే
ప్రస్తుతం దగ్గరుండి ఇష్టమైన వారికి సంబంధించిన వేడుకలు నిర్వహించలేనందున వీడియో కాల్ ద్వారా కానుకలను అందజేయవచ్చు. వీడియో కాల్లో గిటారు వాయించి ఆశ్చర్యపరచవచ్చు. దీని వల్ల అవతలి వ్యక్తి ఆనంద పడటమే కాకుండా, అతడి మానసిక స్థితి మెరుగుపడుతుంది. ప్రస్తుత ఒత్తిడి జీవితాల్లో ఈ రకమైన కానుకలు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి. కానుక ఇవ్వాలి అనుకున్న వారి ఎంపికను బట్టి గిటారు వాయించే వ్యక్తి 10 నుంచి 30 నిమిషాల పాటు గిటారు వాయిస్తారు. అంతే కాకుండా ఏ పాటలను ప్లే చేయాలో కూడా మనమే జాబితాను అందించవచ్చు.
లాక్డౌన్తో సంబంధం లేకుండా..