cryptocurrency in india: ప్రభుత్వం తరఫున క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే యోచనేమీ లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. ప్రస్తుతం దేశంలో క్రిప్టోకరెన్సీలపై ఎలాంటి నియంత్రణా లేదని స్పష్టం చేశారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్‌బీఐ ఎలాంటి క్రిప్టోకరెన్సీలను జారీ చేయడం లేదని మంత్రి తెలిపారు. ఆర్‌బీఐ చట్టం 1994 ప్రకారం సంప్రదాయ కాగితపు కరెన్సీని మాత్రమే కేంద్ర బ్యాంకు జారీ చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కాగితపు కరెన్సీకే త్వరలో డిజిటల్ రూపం ఇవ్వబోతున్నట్లు.. దాన్ని 'సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC)'గా పేర్కొంటున్నట్లు తెలిపారు.