అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. రష్యా, ఒపెక్ దేశాల మధ్య భేదాలతో క్రూడ్ ధరలు 30 శాతం పతనమయ్యాయి. ఫలితంగా బ్యారెల్ చమురు ధర 36 డాలర్ల(రూ.2,660)కు పడిపోయింది.
ఒక బ్యారెల్ పరిమాణం 159 లీటర్లు. ముడి చమురు ధర లీటర్కు రూ.16కే వస్తోందన్నమాట. అంటే మినరల్ వాటర్ బాటిల్ ధర(రూ.20)తో పోలిస్తే ఇది చాలా తక్కువ.
రష్యా, సౌదీ అరేబియా దేశాల మధ్య చమురు ఉత్పత్తుల విషయంలో విభేదాలు తలెత్తడం వల్ల చమురు ధరలను తగ్గించింది(30 శాతానికి పైగా) సౌదీ.