తెలంగాణ

telangana

ETV Bharat / business

స్థిరాస్తి: కరోనా కాలంలో రియల్టర్ల బంపర్ ఆఫర్స్ - housing offers in india

కరోనా ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన స్థిరాస్తి వ్యాపారం.. క్రమంగా పుంజుకుంటోంది. అమ్మకాలు పెరిగేందుకు వ్యాపారులు రాయితీలు, బహుమతులు ప్రకటించటం కొనుగోళ్లకు ఊతమిచ్చాయి. జులై నుంచి స్థిరాస్తి అమ్మకాలు చురుకుగా సాగుతున్నాయని ప్రముఖ సంస్థ అనరాక్​ తెలిపింది. పండగ సీజన్​లో మరిన్ని ఆఫర్లతో ముందుకురానున్నట్లు స్పష్టం చేసింది.

BIZ-REALTY-DISCOUNTS
స్థిరాస్తి

By

Published : Sep 14, 2020, 5:14 PM IST

కరోనా మహమ్మారి కారణంగా ఇళ్ల అమ్మకాలు తగ్గిన నేపథ్యంలో స్థిరాస్తి వ్యాపారులు ఇతర మార్కెటింగ్ వ్యూహాలపై దృష్టి సారించారు. ప్రత్యేక ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ధరలు లేదా పన్నుల తగ్గింపు, ఉచిత కార్​ పార్కింగ్, ఇతర రాయితీలు​ వంటి ఆఫర్లు ఇస్తున్నారు.

కరోనా కాలంలో ఇళ్ల కొనుగోళ్లలో నగదు రాయితీలు స్థిరాస్తి వ్యాపారులకు సాయపడ్డాయి. ఈ ఏడాది గరిష్ఠ అమ్మకాలు జరిపేలా వచ్చే పండగ సీజన్​లోనూ ఈ ఆఫర్లను కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రత్యేక ఆఫర్లతో లాభాలు..

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గోద్రెజ్​ ప్రాపర్టీస్​ అద్భుతమైన ఆఫర్​ ప్రకటించింది. తొలుత 10శాతం కట్టి తర్వాత విడతల వారీగా 90 శాతం చెల్లింపులు చేసేలా ఓ స్కీమ్​ను అందుబాటులోకి తెచ్చింది. ఫలితంగా కరోనా సమయంలో రూ.1,500 కోట్ల వ్యాపారం జరిగింది. బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్​ కూడా ఇదే విధంగా లాభాలు ఆర్జించింది.

వచ్చే ఏడాది మార్చి వరకు స్టాంప్ డ్యూటీని తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సంస్థ నారెడ్కో కూడా తమకు చెందిన 1,000 ప్రాజెక్టుల్లో స్టాంప్ డ్యూటీని భరిస్తామని ప్రకటించింది.

ఆన్​రాక్​ విశ్లేషణ..

ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ 'అనరాక్​'.. మార్కెట్​లోని వివిధ ఆఫర్లను విశ్లేషించింది. పండగ సీజన్​లో మరిన్ని ప్రత్యేకమైన ఆఫర్లతో పలు సంస్థలు రానున్నట్లు తెలిపింది. అనరాక్​ నివేదికలోని కీలకాంశాలు...

  • కొన్ని సంస్థలు 1:9 నిష్పత్తి ఆఫర్​ను ప్రకటిస్తుండగా.. వీటిలో 15 శాతం రాయితీ కూడా ఉంటుంది.
  • మరో సంస్థ పండగ సీజన్​లో కొన్నవారికి ఉచిత కార్​ పార్కింగ్​తో పాటు 7 శాతం నగదు రాయితీ ఇస్తోంది.
  • చెన్నైకి చెందిన ఓ సంస్థ.. సెప్టెంబర్​ 27లోపు బుకింగ్ చేసుకున్నవారికి ప్రత్యేక వెసులుబాట్లను కల్పిస్తోంది. ఉచిత రిజిస్ట్రేషన్​తోపాటు అధునాతన వంటగదిని అందిస్తోంది.
  • కొనుగోలు చేసినవారికి మరికొన్ని సంస్థలు బహుమతులు ఇస్తామని ప్రకటించాయి. లాప్​టాప్​, వాషింగ్ మెషీన్​, స్మార్ట్​ఫోన్​, మైక్రోవేవ్​, వీడియో డోర్​బెల్​, రిఫ్రిజ్​రేటర్​, చిమ్నీ.. ఇతర ఇంటి సామగ్రిని అందిస్తామంటున్నాయి.

ఆఫర్లతోనే అమ్మకాలు..

కరోనా సమయంలో చాలా మంది స్థిరాస్తి వ్యాపారులు.. జులై నుంచి ప్రత్యేక ఆఫర్ల ద్వారా అమ్మకాలు పెంచుకున్నారు. ముంబయిలోని లోధా గ్రూప్​.. సుమారు 1,167 కోట్ల విక్రయాలు చేసింది. ఎం3ఎం గ్రూప్​ ఇదేస్థాయిలో అమ్మకాలు జరిపింది.

కోలుకున్న వ్యాపారం..

స్థిరాస్తి వ్యాపారంపై కరోనా ప్రభావం భారీగా పడిందని ఇన్వెస్టర్స్ క్లినిక్​ వ్యవస్థాపకులు హనీ కటియాల్​ అన్నారు. అయితే, వినూత్న ఆలోచనలతో పరిశ్రమ కోలుకుంటోందని అన్నారు. వినియోగదారులు కొనుగోళ్లపై ఆసక్తి చూపేందుకు ఇవి సమర్థంగా పనిచేస్తున్నాయని వివరించారు. ఆస్తి మార్పిడి ప్రక్రియ ద్వారా రూ.750 కోట్ల అమ్మకాలు జరిగాయని తెలిపారు.

ఇదీ చూడండి:ఈ కామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో 30వేల ఉద్యోగాలు

ABOUT THE AUTHOR

...view details