దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొన్న కేంద్రం రెమ్డెసివిర్, దాని ముడి పదార్థాలపై కస్టమ్స్ సుంకాన్ని మాఫీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ కట్టడిలో రెమ్డెసివిర్ ప్రధాన యాంటీవైరల్ డ్రగ్గా ఉపయోగిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా రెమ్డెసివిర్ లభ్యతను పెంచేదిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అంతేగాక ఇంజెక్షన్ ధర కూడా మరింత తగ్గుతుందని పేర్కొంది.
రెమ్డెసివిర్ దిగుమతులపై సుంకాలు రద్దు - remdesivir imports
కరోనా బాధితుల చికిత్సలో కీలక పాత్ర పోషిస్తోన్న రెమ్డెసివిర్, దాని ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత నోటిఫికేషన్లో పేర్కొంది.
రెమిడెసెవిర్ దిగుమతులపై సుంకాల రద్దు
ప్రజాప్రయోజనాల దృష్ట్యా రెమ్డెసివిర్, దాని ప్రధాన ముడి పదార్థాలను భారత్లోకి దిగుమతి చేసుకునేప్పుడు కస్టమ్స్ సుంకాన్ని మాఫీ చేస్తున్నామని రెవెన్యూ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. దిగుమతి సుంకం నుంచి మినహాయింపు పొందినవాటిలో రెమ్డెసివిర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్(ఏపీఐ), రెమ్డెసివిర్ ఇంజెక్షన్, ఈ ఔషధ తయారీలో ఉపయోగించే బీటా సైక్లోడెక్స్ట్రిన్ ఉన్నాయి. తాజా వెసులుబాటు.. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకూ అమల్లో ఉండనుంది.
Last Updated : Apr 21, 2021, 6:57 AM IST