తాము అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాకు ఒక్కో దేశంలో ఒక్కో ధర ఉంటుందని అంతర్జాతీయ ఫార్మా సంస్థ పైజర్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టీకా అందుబాటులో ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. ఐఎఫ్పీఎమ్ఏ(ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ అసోసియేషన్స్) నిర్వహించిన ఓ ఆన్లైన్ కార్యక్రమంలో వెల్లడించారు ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బౌర్ల.
"ఒక్కో దేశంలో ఒక్కో ధరకు ఫైజర్ టీకాను అమ్ముతాం. అభివృద్ధి చెందిన దేశంలో.. జీడీపీ ఆధారంగా టీకా ధర ఉంటుంది. ఆదాయం మధ్యస్తంగా ఉండే దేశాల్లో ధర తక్కువగా ఉంటుంది. ఆఫ్రికా వంటి అల్పాదాయ దేశాలకు.. ఎలాంటి లాభాలను ఆశించకుండానే వ్యాక్సిన్ను అందిస్తాము."
-- ఆల్బర్ట్ బౌర్ల, ఫైజర్ సీఈఓ.