కరోనాపై పోరాటంలో భాగంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. భారత్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ 'గివ్ ఇండియా'కు ఈ మొత్తం ఇచ్చినట్లు తెలుస్తోంది. గూగుల్ సంస్థ సైతం గివ్ ఇండియాకు ఇదివరకే విరాళాన్ని అందించింది.
"రోజువారీ వేతన కార్మికుల కుటుంబాలకు అవసరమైన నగదు సహాయం అందించడానికి గూగుల్ ఇచ్చిన విరాళానికి సమానంగా రూ.5 కోట్ల గ్రాంటు ప్రకటించిన సుందర్ పిచాయ్‌కు ధన్యవాదాలు."-గివ్ ఇండియా ట్వీట్
ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు బలిగొంటున్న కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు గూగుల్ ఇదివరకే 800 మిలియన్ డాలర్లను ప్రకటించింది. ఇందులో 200 మిలియన్ డాలర్లను ఎన్జీఓలు, చిన్న వ్యాపారాలకు మూలధన సహాయం చేయడానికి కేటాయించింది. కరోనా కట్టడికి యాపిల్ సంస్థతోనూ కలిసి పనిచేస్తోంది గూగుల్. ఇందులో భాగంగా ఐఓస్, ఆండ్రాయిడ్ ఫోన్ల మధ్య పరస్పరం కొవిడ్ సమాచార మార్పిడికి ఓ వేదికను రూపొందిస్తోంది.