తెలంగాణ

telangana

ETV Bharat / business

చౌకగా బంగారం.. దిగుమతి సుంకం తగ్గింపు! - Commerce Ministry proposes cut in gold import duty in Budget

బంగారం ధరలు దిగిరానున్నాయి. ఈ మేరకు.. ఆభరణాల తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు పసిడిపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని బడ్జెట్ ప్రతిపాదనల్లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కోరింది. 12.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 4 శాతానికి పరిమితం చేయాలని సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Commerce Ministry proposes cut in gold import duty in Budget
బంగారంపై దిగుమతి సుంకం తగ్గించే దిశగా కేంద్రం!

By

Published : Jan 13, 2020, 6:18 PM IST

రత్నాలు, ఆభరణాల తయారీ, ఎగుమతుల రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు రానున్న బడ్జెట్​లో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రతిపాదనలు చేసింది కేంద్ర వాణిజ్య శాఖ. ఈ నిర్ణయంతో బంగారం ధరలు దిగిరానున్నాయి.

12.5 నుంచి 4 శాతానికి..

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్​లో దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని వాణిజ్య శాఖ కోరిందిని అధికార వర్గాలు వెల్లడించాయి.

పడిపోయిన దిగుమతులు

నవంబర్​లో 152 టన్నులుగా ఉన్న బంగారం దిగుమతులు డిసెంబర్​ నాటికి 39 టన్నులకు పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో దేశంలో బంగారం దిగుమతులు 7 శాతం తగ్గి 20.57 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 22.16 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

తగ్గిన వర్తక లోటు

బంగారం దిగుమతులు తగ్గడం వల్ల దేశంలో వర్తక లోటు 2018-19లో ఉన్న 133.74 బిలియన్ డాలర్ల నుంచి 2019-20లో 106.84 బిలియన్ డాలర్లకు తగ్గింది. అక్టోబర్​ నెల వరకూ బంగారం దిగుమతుల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది.

రెండో స్థానంలో

ప్రపంచంలో బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. సంవత్సరానికి సగటున 800-900 టన్నుల పుత్తడి విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని అధికంగా విధించడం వల్ల వర్తకులు తమ ఉత్పత్తి కేంద్రాలను విదేశాలకు తరలిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: బ్రేజాకు భారతీయులు ఫిదా.. 5 లక్షల విక్రయాలు!

ABOUT THE AUTHOR

...view details