దేశవ్యాప్తంగా సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ 2020కి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. సహకార బ్యాంకులపై నమ్మకం పెంచేందుకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ ఆర్డినెన్స్‌కు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఆమోదముద్ర వేశారు. దీనితో ఈ ఆర్డినెన్స్ ప్రక్రియ పూర్తయింది.
ఆర్డినెన్స్ ఉద్దేశం, ఉపయోగాలు..
దేశవ్యాప్తంగా ఉన్న 1,482 పట్టణ, 58 బహుళ రాష్ట్రాల (మల్టీస్టేట్) సహకార బ్యాంకులను ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి తీసుకురావడం ఈ ఆర్డినెన్స్ ముఖ్య ఉద్దేశం.