ఐటీ, ఎఫ్ఎంసీజీ మినహా... అన్ని రంగాల్లో షేర్ల కొనుగోళ్లతో స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వరుసగా రెండో సెషన్లోనూ సూచీలు సానుకూలంగానే ట్రేడయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 157 పాయింట్లు పెరిగింది. 39 వేల 592 వద్ద సెషన్‌ను ముగించింది. ఇంట్రాడేలో 39 వేల 320 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. అనంతరం 39 వేల 674 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని చేరింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 51 పాయింట్లు లాభపడింది. 11 వేల 847 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11,758-11, 872 మధ్య కదలాడింది.
మొత్తం 1418 షేర్లు పుంజుకున్నాయి. 1051 షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి.
జూన్ డెరివేటివ్స్ గురువారం ముగుస్తున్న తరుణంలో ఫార్మా, లోహ, ఇన్ఫ్రా, బ్యాంకింగ్ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
పాంపియో, మోదీ భేటీలో వాణిజ్యంపై సానుకూల వార్తలు రావచ్చనే ఆశలు మదుపర్లలో ఉత్తేజాన్ని నింపాయి.
వేదాంత, పవర్‌గ్రిడ్‌కు లాభాలు..