అమెజాన్ ద్వారా 1000కిలోల గంజాయి అక్రమ రవాణా వ్యవహారంపై.. భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ), ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను అమెజాన్ ఉల్లంఘించిందని లేఖలో వివరించింది సీఏఐటీ.
అయితే ఈ ఘటనపై తమ దృష్టికి రాలేదని.. ఈ వ్యవహారంపై ప్రస్తుతం తాము విచారణ జరుపుతున్నామని అమెజాన్ ఇటీవలే తెలిపింది.
ఈ కేసుపై వెంటనే సిట్‌తో దర్యాప్తు చేపట్టాలని లేఖలో ప్రధాని మోదీని కోరారు సీఏఐటీ సభ్యులు.