తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​ భేరి: ఓటేసిన పారిశ్రామిక దిగ్గజాలు - పోలింగ్

పలువురు పారిశ్రామిక ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబయిలోని వివిధ కేంద్రాల్లో అంబానీ పరివారం, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఆది గోద్రెజ్ ఓటువేశారు.

భారత్​ భేరి: ఓటేసిన పారిశ్రామిక దిగ్గజాలు

By

Published : Apr 29, 2019, 2:47 PM IST

Updated : Apr 29, 2019, 3:32 PM IST

ఎప్పుడూ ఎదురులేకుండా నడిచే పారిశ్రామిక ప్రముఖులు వరుసల్లో నిలిచారు. రానున్న ఐదేళ్ల దేశ భవిష్యత్​ను నిర్ణయించే ఎన్నికల్లో భాగస్వాములు అయ్యేందుకు పోలింగ్ కేంద్రాలకు విచ్చేశారు.

అంబానీలకు ఇదో రికార్డు

రిలయన్స్ గ్రూప్ ముకేశ్​ అంబానీ కుటుంబసభ్యులంతా... ముంబయిలోని జీడీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో అందరికన్నా ముందు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముకేశ్​ సోదరుడు అనిల్ అంబానీ కఫ్ఫె పరేడ్​ కేంద్రంలో ఓటు వేశారు.

ముందుగా ఓటేసిన వారిలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్​. చంద్రశేఖరన్, ఆది గోద్రెజ్ ఉన్నారు. గోద్రెజ్​ వర్లి కేంద్రంలో ఓటేశారు.

రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ పెద్దెర్​ రోడ్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్​ మహీంద్ర, ఆ సంస్థ ఎండీ పవన్ గోయెంకా జుహులో ఓటు వేశారు. బీఎస్​ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్​ చౌహన్, మోర్గాన్ స్టాన్లీ మేనెజింగ్ డైరెక్టర్ రిద్దమ్ దేశాయి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పారిశ్రామిక వేత్తల ఓట్లు దక్షిణ ముంబయి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థానంలో సిట్టింగ్​ ఎంపీ అరవింద్​ సావంత్​ మరోమారు శివసేన టికెట్​పై బరిలో నిలవగా, కాంగ్రెస్​ నుంచి మిళింద్ దేవరా పోటీలో ఉన్నారు.

భారత్​ భేరి: ఓటేసిన పారిశ్రామిక దిగ్గజాలు
Last Updated : Apr 29, 2019, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details