బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. దీంతో పసిడి ధరలు తగ్గి, దేశీయ ఆభరణాలు, రత్నాల ఎగుమతికి మార్గం సుగమం కానుంది. బంగారం, వెండి కడ్డీలు, ప్లాటినం, విలువైన లోహ నాణేలపైనా దిగుమతి సుంకాన్ని తగ్గించింది కేంద్రం.
అయితే బంగారం, వెండి సహా కడ్డీ బంగారంపై 2.5 శాతం వ్యవసాయ మౌలిక, అభివృద్ధి(అగ్రి ఇన్ఫ్రా) సుంకాన్ని విధించనుంది కేంద్రం.
"బంగారం, వెండిపై ప్రస్తుతం 12.5 శాతం సాధారణ కస్టమ్స్ డ్యూటీ ఉంది. 2019 జులైలో కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి పెంచినందున బంగారం ధరలు భారీగా పెరిగాయి. ధరలను ఇదివరకటి స్థాయికి తీసుకొచ్చేందుకు బంగారం, వెండి ధరలను ఇప్పుడు హేతుబద్ధీకరిస్తున్నాం."