లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూకు చెందిన ద్విచక్ర వాహనాల విభాగం బీఎండబ్ల్యూ మోటరాడ్.. తన తొలి విద్యుత్ స్కూటర్ బీఎండబ్ల్యూ సీఈ04ను(BMW electric scooter ce04) ఆవిష్కరించింది. అదిరిపోయే డిజైన్, అధునాతన ఫీచర్లతో ఈ మోడల్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఏంటీ ఫీచర్లు..
- ముందు భాగం సహా స్కూటర్ రెండు వైపులా స్టోరేజీ సదుపాయం
- టైప్-సీ పోర్ట్‌తో మొబైల్ ఛార్జింగ్ కంపార్ట్మెంట్
- హై రెజల్యూషన్ టీఎఫ్టీ డిస్ప్లే, నేవిగేషన్ సదుపాయం సహా స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం
- కేవలం 2.6 సెకండ్లలో 50కి.మీల వేగాన్ని అందుకునే సామర్థ్యం. గరిష్ఠంగా 120 కి.మీల వేగం.
- ఒక్కసారి ఛార్జింగ్‌తో 130కి.మీల ప్రయాణం
- ఒక గంట 40 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్
రెండు రంగుల్లో తీసుకొస్తున్న ఈ స్కూటర్ ఆకర్షణీయంగా కనబడుతోంది. ఒకటి మ్యాట్ బ్లాక్ కాగా, రెండోది తెలుపు, ఆరంజ్ కాంబినేషన్లో వస్తోంది.