జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ 5 సీరిస్ సెడాన్ కార్లలో అప్డేటెడ్ వెర్షన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.62.9 లక్షలతో ప్రారంభమవుతుందని ప్రకటించింది.
దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ఈ మోడల్ పెట్రోల్ వేరియంట్ (బీఎండబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్) ధర రూ.62.9 లక్షలుగా నిర్ణయించింది. డీజిల్ ఇంజిన్తో.. బీఎండబ్ల్యూ 530డీ ఎం స్పోర్ట్, బీఎండబ్ల్యూ 520డీ లగ్జరీ లైన్ పేర్లతో రెండు వేరియంట్లను తీసుకువచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.63.9లక్షలు, రూ.71.9లక్షలుగా నిర్ణయించింది.
ఫీచర్లు ఇవే..
ఈ మోడల్లో అధునాతన ఫీచర్లను పొందుపరిచింది బీఎండబ్ల్యూ. రిమోట్ కంట్రోల్ పార్కింగ్, హెడ్-అప్ డిస్ప్లే, రివర్సింగ్ అసిస్టెంట్, పార్కింగ్ అసిస్టెంట్, జెస్టర్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ముఖ్యమైనవి.
అదిరే స్పీడుతో..
- బీఎండబ్ల్యూ 530ఐ- 0 నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని కేవలం 6.1 సెకన్లలోనే అందుకోగలదు.
- బీఎండబ్ల్యూ 520డీ- 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 7.3 సెకన్లలో అందుకుంటుంది
- బీఎండబ్ల్యూ 530డీ- 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 5.7 సెకన్లలో అందుకునే సామర్థ్యం దీని సొంతం
ఇదీ చూడండి:టాటా, మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్లు!
ఇదీ చూడండి:బడ్జెట్ ధరలో 'ఎస్యూవీ' కావాలా? ఇవి ట్రై చేయండి!