వినియోగదారులను ఆకర్షిస్తూ... తమ పరిశ్రమలను మరింత సమర్ధంగా నడపాలంటే వచ్చే అయిదేళ్లలో ఉద్యోగులకు నాలుగు రంగాల్లో నైపుణ్యం అవసరమని పరిశ్రమ వర్గాలు సృష్టం చేస్తున్నాయి. డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ తదితర రంగాల్లో నైపుణ్యం తప్పనిసరని స్పష్టం చేస్తున్నాయి. భారత నైపుణ్య నివేదికలో భాగంగా భారత్ హైరింగ్ ఇంటెంట్-2020 పేరిట దేశవ్యాప్తంగా వివిధ పరిశ్రమల ఉన్నతాధికారులతో నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు తెరపైకి వచ్చాయి.
బ్యాంకులు రోబోలను సమకూర్చుకుంటున్నాయని, చాట్‌బూట్స్ వాడుతున్నాయని, ఫార్మా, వైద్య రంగాలు కృత్రిమ మేధపై దృష్టి పెట్టడంతో పరిశ్రమల్లో పనితీరు మారుతోందని ఆ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాది (2020) అత్యధికంగా ఈ-కామర్స్, బ్యాంకింగ్-ఆర్థిక సేవలు-బీమా రంగాలు (బీఎఫ్‌ఎస్‌ఐ) ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోనున్నాయి. ఈ-కామర్స్‌లో 55-60 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐలో 30-35 శాతం నియామకాలు పెరుగుతాయని పరిశ్రమల వర్గాలు అంచనా వేశాయి. ఒక్క స్విగ్గీ కంపెనీనే మరో మూడు లక్షల మంది ఉద్యోగులను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఐటీ, ఐటీఈఎస్, బీపీవో రంగాల్లోనూ కొలువుల వృద్ధి ఉంటుందని విశ్వవిస్తున్నారు.
వచ్చే అయిదేళ్లలో నైపుణ్యం అవసరమయ్యే రంగాలివే
* డేటా సైన్స్ అండ్ అనాలసిస్
* డిజిటల్ మార్కెటింగ్
* రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్
* హ్యూమన్ సెంటర్డ్ డిజైన్ (కృత్రిమ మేధ తదితర)
కొలువుకు ప్రాధాన్యమిచ్చే నైపుణ్యాలు