తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒకటి కన్నా ఎక్కువ పాన్​కార్డులు ఉంటే రూ.10 వేల జరిమానా

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్​)పై ఆదాయపు పన్ను శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి కన్నా ఎక్కువ పాన్​కార్డులు ఉన్న వారు.. అదనపు కార్డులను వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.

By

Published : Feb 11, 2020, 8:22 PM IST

Updated : Mar 1, 2020, 12:40 AM IST

beware-have-two-pan-cards-you-will-end-up-losing-rs-10000
ఒకటి కన్నా ఎక్కువ పాన్​కార్డులకు రూ.10 వేల జరిమానా

ఒక వ్యక్తి ఒకే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌‌)ను కలిగి ఉండాలనే నిబంధనను అతిక్రమించిన వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ చర్యలను తీసుకోనుంది. ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డ్‌లను కలిగిన వారికి రూ.10,000 జరిమానా విధించాలని నిర్ణయించింది. అయితే వివిధ కారణాల వల్ల ఒకటి కన్నా ఎక్కువ పాన్‌కార్డులను కలిగి ఉన్నవారు...తమ వద్ద అదనంగా ఉన్న పాన్‌కార్డులను తిరిగి ఇవ్వడం ద్వారా ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఆదాయపుపన్ను శాఖ కల్పించింది. ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉంటే వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.

రెండు కార్డులున్నాయా?

సాధారణంగా ఎన్నారైలు ఈ విధంగా ఎక్కువ పాన్‌ కార్డులను కలిగిఉంటారు. భారత్‌ను వీడి వెళ్లక ముందు వీరికి ఒక పాన్‌కార్డు ఉంటుంది. ఆపైన కొన్ని సంవత్సరాల అనంతరం స్వదేశానికి మళ్లీ వచ్చినప్పుడు వారు మరో పాన్‌ కార్డును తీసుకుంటారు. అంతేకాకుండా తమ పాన్‌ కార్డులో ఉన్న వివరాల్లో తప్పులు ఉన్నప్పుడు... వాటిని సరిచేయవచ్చు. దానికి బదులు కొందరు మరో కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారు. తొలికార్డును స్వాధీనం చేయకుండానే మరోదాన్ని పొందుతారు.

ఏం చేయాలి?

వివిధ కారణాల వలన ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను శాఖ జరిమానా, చర్యలకు గురికావలసి ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే వారు ఆన్ లైన్‌, ఆఫ్‌లైన్‌ ... రెండు విధానాల ద్వారా కూడా తప్పని సరిగా అదనపు పాన్‌ కార్డులను తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. చాలా సులువైన విధానం ద్వారా అదనపు పాన్‌ కార్డులను ప్రభుత్వానికి అప్పగించొచ్చు.

ఇదీ చూడండి:పిచాయ్​కు వరుస షాక్​లు... గూగుల్​కు ఏమైంది?

Last Updated : Mar 1, 2020, 12:40 AM IST

ABOUT THE AUTHOR

...view details