కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సేవలందిస్తున్న విమానయాన సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. వైరస్ ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం సుమారు రూ. 2 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోనున్నట్లు అంచనా వేసింది అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ).
చైనాలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా వాయు రవాణా డిమాండ్ 13 శాతం పడిపోయిందని ఐఏటీఏ వెల్లడించింది. కరోనా వ్యాప్తిని సాధ్యమైనంత త్వరగా అడ్డుకోవాలని.. లేదంటే వాయు రవాణాలో తీవ్రమైన సంక్షోభం తలెత్తుతుందని అభిప్రాయపడింది. ఇప్పటికే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన సంస్థలు 1.5 బిలియన్ డాలర్లు నష్టపోయాయని తెలిపింది.
రెండు దశాబ్దాల క్రితం సార్స్ తరహాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఫలితంగా చైనా దేశీయ మార్కెట్ సుమారు 12.8 బిలియన్ డాలర్ల నష్టపోనుందని అంచనా వేసింది ఐఏటీఏ. 2008-09 ఆర్థిక సంక్షోభం తర్వాత అంతగా డిమాండ్ తగ్గిపోవటం ఇదే మొదటిసారని పేర్కొంది.
తిరోగమన వృద్ధి!