తెలంగాణ

telangana

ETV Bharat / business

అవే భయాలు... మూడో రోజు మార్కెట్లకు నష్టాలు - నిఫ్టీ

అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ స్టాక్​మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 129 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 38 వేల 993 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 11 వేల 650 దిగువకు చేరింది.

ప్రతికూలతల నడుమ మార్కెట్లకు నష్టాలు

By

Published : Jun 25, 2019, 9:50 AM IST

Updated : Jun 25, 2019, 9:59 AM IST

స్టాక్​మార్కెట్లు వరుసగా 3వ సెషన్​లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూలతలే ఇందుకు కారణం. బొంబాయి స్టాక్​ ఎక్సేంజి సూచీ-సెన్సెక్స్​ ఆరంభ ట్రేడింగ్​లోనే 100 పాయింట్లకు పైగా కోల్పోయింది. ప్రస్తుతం 129 పాయింట్లు క్షీణించి... 38 వేల 993 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్సేంజి సూచీ- నిఫ్టీ 35 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం 11 వేల 650 మార్కు వద్ద కదలాడుతోంది.

విద్యుత్​ రంగం మినహా.. లోహ, ఆటో మొబైల్​, బ్యాంకింగ్​, ఐటీ రంగాలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

లాభనష్టాల్లోనివివే...

ఓఎన్​జీసీ 1.63, పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​ 1.38 శాతం మేర లాభపడ్డాయి. ఐఓసీ, బీపీసీఎల్​, ఐషర్​ మోటర్స్​ లాభాల జాబితాలో ఉన్నాయి.

జీ ఎంటర్​టైన్​మెంట్స్ లిమిటెడ్​, యూపీఎల్​, టాటా స్టీల్​, భారతీ ఇన్​ఫ్రాటెల్​ లిమిటెడ్​, ​హెచ్​సీఎల్​ టెక్​ నష్టాలతో ట్రేడింగ్​ను ప్రారంభించాయి.

రూపాయి స్వల్ప వృద్ధి...

డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ... 69. 32 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Jun 25, 2019, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details