అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon India) భారీగా ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 35 నగరాల్లో 8 వేల మందికి పైగా సిబ్బందిని ఈ ఏడాదే నియమించుకోనున్నట్లు తెలిపింది. కార్పొరేట్, టెక్నాలజీ, కస్టమర్ సర్వీస్, అపరేషన్స్ వంటి విభాగాల్లోకి వీరిని తీసుకోనున్నట్లు (Amazon Hiring) తెలిపింది.
ఉద్యోగ అవకాశాలు ఉన్న నగరాల్లో ప్రధానంగా హైదరాబాద్(Job opportunities in Hyderabad), బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, ముంబయి, కోల్కతా, అహ్మదాబాద్, కోయంబత్తూర్, పుణె, భోపాల్లు ఉన్నాయి.
దీనితో పాటు దేశవ్యాప్తంగా 2025 నాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని అమెజాన్ పేర్కొంది. ఇప్పటికే 10 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వివరించింది. కరోనా సమయంలో 3 లక్షల మందికి (ప్రత్యక్షంగా, పరోక్షంగా) ఉపాధి కల్పించినట్లు పేర్కొంది అమెజాన్. ఈ సమయంలో నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరిగినట్లు స్పష్టం చేసింది.