వినియోగదారులకు ఉచితంగా వీడియో స్ట్రీమింగ్ సదుపాయం కల్పిస్తూ ఓ కొత్త సర్వీస్‌తో ముందుకొస్తున్నట్లు అమెజాన్ సంస్థ తెలిపింది. వెబ్ సిరీస్, టెక్నాలజీ వార్తలు, ఫుడ్, ఫ్యాషన్ మొదలైన వాటికి సంబంధించిన వీడియోలు ఉచితంగా చూసేందుకు 'మినీ టీవీ'ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు శనివారం ప్రకటించింది. ఈ సేవలు అమెజాన్ షాపింగ్ యాప్‌లో ఉంటాయని స్పష్టం చేసింది.
షాపింగ్ చేస్తూ నగదు చెల్లించిన కొద్దీ.. కొత్త వీడియోలు ఉచితంగా చూసే అవకాశం 'మినీటీవీ'లో కల్పించనుంది అమెజాన్. అయితే.. ప్రైమ్ మాదిరిగా సబ్స్క్రిప్ఫన్ పద్ధతి దీనికి లేదు. వీడియో స్ట్రీమింగ్ కోసం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించింది ఈ సంస్థ.