జూన్ డెరివేటివ్‌లకు నేడు గడువు తీరనున్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు నష్టాలకు గురయ్యాయి. స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 6 పాయింట్లు కోల్పోయింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ కూడా 6 పాయింట్లు క్షీణించింది.
ఇంట్రాడే సాగిందిలా...
సెన్సెక్స్ నేటి ట్రేడింగ్‌ను 39 వేల 633 వద్ద ప్రారంభించింది. ఒక దశలో 39 వేల 817 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సూచీ.. ఒడుదొడుకులకు లోనై 300 పాయింట్ల మేర కోల్పోయింది. సెషన్ చివరకు 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 39 వేల 586 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 6 పాయింట్లు క్షీణించింది. 11 వేల 850 మార్కు దిగువకు చేరింది. చివరకు 11 వేల 842 వద్ద స్థిరపడింది.