కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రసంగంలో స్వచ్ఛ భారత్ ను ప్రధానంగా ప్రస్తావించారు. దేశంలో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. మోదీ ప్రభుత్వం వచ్చాక.. దేశవ్యాప్తంగా 9 కోట్ల 6 లక్షల కొత్త మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు 2 నాటికి దేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ సంకల్పాన్ని.. సాధించబోతున్నట్టు చెప్పారు. మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా దేశానికి ఇచ్చే కానుక ఇదేనని తెలిపారు. డిజిటల్ లిటరసీ కార్యక్రమం ద్వారా నగరాలు, పట్టణాలు, గ్రామాలను టెక్నాలజీతో అనుసంధానం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. యువతలో ఆశావహ దృక్పథం పెంచే దిశగా చర్యలు తీసుకునేందుకు.. గాంధీపీడియా పేరిట ప్రత్యేక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
అక్టోబరు 2 నాటికి 'ఓడీఎఫ్ భారత్' సాధ్యమే: నిర్మల - odf
స్వచ్ఛ భారత్ అభిమాన్ పథకం విజయవంతమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. అక్టోబర్ 2, 2019 నాటికి బహిరంగ మల విసర్జన రహిత దేశంగా భారత్ అవతరించబోతోందని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
swachh bharat