తెలంగాణ

telangana

ETV Bharat / business

దోమ కుడితే.. 'ఎయిర్​టెల్'​ డబ్బులిస్తుంది..! - ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంకు

దోమకాటు వల్ల ప్రబలే ఏడు రకాల వ్యాధులకు పరిహారం అందించేందుకు.. మార్కెట్​లోకి ఓ ఇన్సూరెన్స్​ పాలసీ వచ్చింది. ' మస్కిటో డిసీస్​ ప్రొటెక్షన్​ పాలసీ' పేరుతో.. ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ ఎర్గో జనరల్​ ఇన్సూరెన్స్​లు సంయుక్తంగా దీనిని తీసుకొచ్చాయి. కేవలం రూ.99 ప్రీమియం చెల్లించి ఈ పాలసీని తీసుకోవచ్చు.

దోమ కాటుకూ బీమా.. ప్రీమియం రూ.99 మాత్రమే

By

Published : Sep 27, 2019, 6:07 PM IST

Updated : Oct 2, 2019, 6:00 AM IST

అసలే వర్షాకాలం... దోమలు విజృంభించి వ్యాధులు ప్రబలే సమయం. ఆసుపత్రులకు వెళితే... జేబుకు చిల్లుపడే అవకాశం. ఇప్పుడు కథ మారింది. దోమకాటు వల్ల సంక్రమించే ఏడు రకాల వ్యాధులకు పరిహారం అందించేందుకు ఓ సరికొత్త ఇన్సూరెన్స్ పాలసీ వచ్చింది. ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్​లు సంయుక్తంగా ఈ వినూత్న పాలసీని అందుబాటులోకి తెచ్చాయి.

రూ.99 లకే బీమా

దేశంలో బీమా విస్తృతిని పెంచడంలో భాగంగా 'మస్కిటో డిసీస్​ ప్రొటెక్షన్​ పాలసీ' (ఎండీపీపీ)ని తీసుకొచ్చినట్లు ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంకును ఉపయోగిస్తున్నవారు ఏడాదికి రూ.99 ప్రీమియం చెల్లించి ఈ పాలసీ తీసుకోవచ్చని తెలిపింది.

వ్యాధుల జాబితా

దోమల వల్ల వ్యాప్తి చెందే డెంగీ, మలేరియా, చికెన్​ గున్యా, బోదకాలు, మెదడువ్యాపు వ్యాధి, జికా వైరస్​ లాంటి వ్యాధులు ఈ పాలసీ కిందకు వస్తాయి. రోగం బారినపడి 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉంటే, ఈ పాలసీలో పేర్కొన్న మొత్తం విలువ... గరిష్ఠంగా రూ.10,000 వరకూ పరిహారంగా అందుతుంది.

అల్ప ఆదాయ వర్గాలవారికి..

"దాదాపు 40 లక్షల మందికి పైగా మా ఖాతాదారులకు ఈ పాలసీని అందించబోతున్నాం. రోజువారీ ఆదాయం పొందేవారు.. ఒక రోజు ఆసుపత్రిలో ఉన్నా వారికి ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది. దాన్ని ఎంతో కొంత తీర్చడమే ఈ ఇన్సూరెన్స్ పాలసీ ప్రధాన లక్ష్యం."
-అనుబత్రా విశ్వాస్, ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంక్​ ఎండీ, సీఈఓ

ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా ఈ బీమాను సులువుగా తీసుకునే వీలుందని అనుబత్రా విశ్వాస్​​ పేర్కొన్నారు. వాలెట్ ఇన్సూరెన్స్​ పోర్ట్​ఫోలియోలో భాగంగా ఈ పాలసీని అందిస్తున్నామని హెచ్​డీఎఫ్​సీ ఎర్గో ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్ అనుజ్​ త్యాగి వివరించారు.

ఇదీ చూడండి: రూపాయి బలపడింది- బంగారం దిగొచ్చింది.. ఎంతంటే...

Last Updated : Oct 2, 2019, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details