దేశంలో దాదాపు 30 శాతం డ్రైవింగ్ లైసెన్స్ నకిలీవేనని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. నాగ్‌పుర్‌లో జాతీయ భద్రతా ప్రచారంలో ఆదివారం పాల్గొన్న గడ్కరీ ఈ విషయం వెల్లడించారు.
'బోగస్ లైసెన్స్‌లు పొందటం ఇప్పుడు చాలా సులభమైంది. డబ్బులివ్వడం ద్వారా ఎవరో ఒకరు ఆర్టీఓ ఆఫీస్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఆధార్తో అనుసంధానంతో నకిలీ లైసెన్స్‌లకు అడ్డుకట్ట పడుతుంది.' అని పేర్కొన్నారు.