తెలంగాణ

telangana

ETV Bharat / budget-2019

బడ్జెట్​ 2019: 'ధరలు పెంచినా ద్రవ్యోల్బణం అదుపులోనే'

పెట్రోల్​, డీజిల్​పై సెస్​ పెంపుతో ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ స్పష్టం చేశారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి.. బడ్జెట్​లోని పలు అంశాలపై వివరణ ఇచ్చారు.

By

Published : Jul 5, 2019, 10:19 PM IST

Updated : Jul 5, 2019, 11:38 PM IST

నిర్మలా సీతారామన్​

కేంద్ర బడ్జెట్​ 2019లో చమురు ఉత్పత్తులపై సెస్​ పెంపుతో ద్రవ్యోల్బణంపై ప్రభావం ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ స్పష్టం చేశారు. బడ్జెట్​లోని అంశాలపై ఈటీవీ భారత్​తో ప్రత్యేక మాట్లాడారు సీతారామన్​.

"ఈ ప్రభుత్వంలో ద్రవ్యోల్బణ నియంత్రణ ఉత్తమంగా ఉంది. ద్రవ్యోల్బణం నిర్వహించే స్థాయిలోనే ఉన్నట్లు చాలా మంది ఆర్థికవేత్తలు స్పష్టం చేశారు. ఆర్బీఐ ద్రవ్యోల్బణ నిర్వహణపై పెద్ద ప్రభావమేమీ ఉండదు."

-నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

రక్షణ పద్దు పెంచాం

ఈ ఏడాది రక్షణ రంగానికి నిధులు పెంచినట్టు మంత్రి తెలిపారు. పెన్షన్లను కూడా పెంచామన్నారు.

"గతేడాదితో పోలిస్తే సైనికుల పెన్షన్​ నిధికి రూ.1.12 లక్షల కోట్లు కేటాయించాం. మొత్తంగా రక్షణ రంగానికి 4.31 లక్షల కోట్లు ప్రకటించాం. ఇది మొత్తం కేంద్ర బడ్జెట్​లో 15.47 శాతం."

-నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

విద్యారంగంలో సమూల మార్పు

విద్యారంగాన్ని సంస్కరించేందుకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. భారత్​లోని విద్యాసంస్థలను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు.

"విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు జాతీయ విద్యా విధానం-2019ను ప్రవేశపెట్టబోతున్నాం. అంతేకాకుండా జాతీయ పరిశోధక నిధిని నెలకొల్పుతాం. 'స్టడీ ఇన్​ ఇండియా'తో విదేశీయులూ పైచదువులకు భారత్​ను ఎంచుకునేలా తయారు చేస్తాం."

-నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

అంకురాలకు ప్రోత్సాహం

భారత్​లో అంకురసంస్థలు నిలదొక్కుకుంటున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఏంజెల్​ సమస్యను ఇప్పటికే పరిష్కరించామన్నారు.

"అంకుర సంస్థలకు చాలా పన్ను మినహాయింపులు కల్పించాం. బడ్జెట్​లో చేయదగినవి, సాధించగలిగే లక్ష్యాలనే నిర్దేశించుకున్నాం. ఉదాహరణకు.. రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడి ఉపసంహరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇదేమీ కష్టసాధ్యం కాదు. "

-నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

బ్యాంకులు-కార్పొరేట్​

బ్యాంకేతర ఫైనాన్సియల్​ కంపెనీల సంక్షోభంపై ప్రభుత్వం దృష్టి సారించిందని సీతారామన్​ తెలిపారు. బ్యాంకింగ్​ వ్యవస్థలో ఈ అంశం ఎంతో క్లిష్టమైనదన్నారు. వీటిని క్రమబద్ధీకరించే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

రూ. 400 కోట్ల టర్నోవర్ లోపు ఉన్న కంపెనీలకు 25 శాతం పన్ను స్లాబులోకి తీసుకురావటంపైనా స్పందించారు. కార్పొరేటు పన్ను విధానంలో కర్కశమైన వైఖరి లేదని, ఉండబోదని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి.

ఇదీ చూడండి: బడ్జెట్​ 2019: గ్రామీణ భారతానికి సరికొత్త వన్నెలు

Last Updated : Jul 5, 2019, 11:38 PM IST

ABOUT THE AUTHOR

...view details